బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 14:27:53

నిమిషంలో 56 ప‌దాల స్పెల్లింగ్స్‌‌ను రివ‌ర్స్‌లో చెప్పిన మ‌హిళ‌.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం!

నిమిషంలో 56 ప‌దాల స్పెల్లింగ్స్‌‌ను రివ‌ర్స్‌లో చెప్పిన మ‌హిళ‌.. గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో స్థానం!

ఇంగ్లీష్ ప‌దాల‌ను ట‌క‌ట‌కా చెప్పమంటేనే క‌ష్ట‌ప‌డిపోతారు. అలాంటిది గుక్క‌తిప్ప‌కుండా అంటే.. స‌చ్చిపోతారు. పోనీ ఒక‌సారి ఇంగ్లీష్ ప‌దాల స్పెల్లింగ్‌ను రివ‌ర్స్‌లో చెప్పుకుందాం అంటే ఒక‌టి, రెండు క‌న్నా ముందుకు పోదు. కానీ ఈ మ‌హిళ మాత్రం 56 ప‌దాలకు స్పెల్లింగ్‌ను రివ‌ర్స్‌లో చెప్పేసింది. అది కూడా ఒక నిమిషం వ్య‌వ‌ధిలో. అందుకే ఆమెకు గిన్సిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు వ‌రించింది.

మిన్నెసోటాకు చెందిన పామ్ ఒన్నెన్ ఈ ఘ‌న‌త సాధించింది. ఆమె ప‌దాల‌ను రివర్స్‌లో చెప్పేట‌‌ప్పుడు ఎంత ప్ర‌శాంతంగా, కూల్‌గా చెప్పిందో వీడియోలో చూస్తే ఆశ్చ‌ర్యం వేస్తుంది. అస‌లు ఒన్నెన్‌కు త‌న ప్ర‌తిభ‌కు సంబంధించిన రికార్డు ఉంద‌ని అస‌లు తెలియ‌ద‌ట‌.  ఇలా చేయ‌డం చాలా క‌ష్టం. ఇలా ఒక‌రు కూడా ప్ర‌య‌త్నించి ఉండ‌రు అని అంటున్న‌ది ఒన్నెన్‌. త‌ను చిన్న‌‌ప్ప‌టి నుంచి నేర్చుకున్న ప్ర‌తి ప‌దాన్ని రివర్స్‌లో చెప్ప‌డం అల‌వాటుగా మార్చు‌కున్న‌ది. ఇప్పుడు ఇదే త‌న పేరును లోకానికి తెలిసేలా చేసింది. అయితే ఇలాంటి ప్ర‌తిభ క‌లిగిన వారు త‌న‌లా చాలామంది ఉన్నార‌ని త‌ర్వాత తెలుసుకొని ఆనందం వ్య‌క్తం చేసింది. మునుప‌టి రికార్డులో 17 ప‌దాలకే స్పెల్లింగ్స్ చెప్పి రికార్డు సాధించారు. 


 

 


logo