మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 12:07:55

వామ్మో! మహిళ‌ మెద‌డులో సూదులు.. ఎలా వెళ్లాయి?

వామ్మో! మహిళ‌ మెద‌డులో సూదులు.. ఎలా వెళ్లాయి?

సూది చ‌ర్మానికి గుచ్చుకుంటేనే అల్లాడిపోతాం. అలాంటిది ఆ మ‌హిళ మెద‌డులోకి చొచ్చుకొని పోయాయి. విచిత్రం ఏంటంటే.. ఆ సూదులు ఆమె మెద‌డులోకి ఎప్పుడు, ఎలా వెళ్లాయో తెలియ‌దు. త‌ల‌మీద చిన్న గాయం, మ‌చ్చ కూడా లేదంట‌. మ‌రి ఎలా వెళ్లింది?  చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో  జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమెకు గాయాలు త‌గ‌ల‌క‌పోయిన‌ప్ప‌టికీ వైద్యుల‌ను సంప్ర‌దించింది. వారు అన్ని టెస్టులు చేసి, సీటీస్కాన్ కూడా చేశారు. ఆ స్కాన్ రిపోర్టులో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది.

ఆమె మెద‌డులో 4.9 మి.మీ. పొడ‌వున్న 2 సూదులు క‌నిపించాయి. ఇది యాక్సిడెంట్ వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదం కాదు. దీంతో షాక్‌కు గురైన వైద్యులు ఆమెను విచారించారు. కానీ త‌ల‌కు సంబంధించిన గాయ‌లు, ప్ర‌మాదం, స‌ర్జ‌రీలు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పింది. చిన్న‌ప్పుడు జుహు త‌ల్లిదండ్రులు యాత్ర‌ల‌కు వెళ్లేట‌ప్పుడు త‌న‌ని త‌న పిన్ని ఇంట్లో వ‌దిలేసి వెళ్లేవార‌ట‌. అప్పుడు పిన్ని జుహు త‌ల మీద రెండు మ‌చ్చ‌లు చూసిన‌ట్లు చెప్పింద‌ని జుహు త‌ల్లిదండ్రులు వైద్యుల‌కు వెల్ల‌డించారు. ఇప్పుడు త‌ల‌మీద గాయ‌లు, మ‌చ్చ‌లు వంటివేం క‌నిపించ‌క‌పోయేస‌రికి వైద్యుల‌కు ఏం అర్థం కాలేదు. ఈ సూదులు ఇలానే ఉంటే ప్ర‌మాదం వెంట‌నే స‌ర్జ‌రీ చేసి తొలిగించాల‌ని వైద్యులు వెల్ల‌డించారు. 


logo