శనివారం 06 జూన్ 2020
International - Apr 28, 2020 , 23:19:01

మాస్కులు అంద‌జేస్తున్న చెట్టు!

మాస్కులు అంద‌జేస్తున్న చెట్టు!

గ‌త మూడు నెల‌ల నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మాస్కులు, శానిటైజ‌ర్లు, ఇత‌ర భ‌ద్ర‌తా ప‌రిక‌రాల కొర‌త బాగా ఏర్ప‌డింది. ఎంత‌మంది వీటి త‌యారీకి పూనుకున్నా, కొర‌త‌ను భ‌ర్తీ చేయ‌లేక‌పోతున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి మాత్రం త‌గ్గుముఖ ప‌ట్ట‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు మాస్కులు అంద‌క‌పోవ‌డంతో బ‌య‌ట‌కు నేరుగా వ‌చ్చేస్తున్నారు. అందుకు యుఎస్‌లోని అయోవాకు చెందిన ఒక మ‌హిళ వినూత్నంగా ఆలోచించిన‌ది. ఆమె పేరు డెబ్ సెగ్గిన్స్‌. ఫేస్‌మాస్కులు త‌యారు చేయ‌డం ప్రారంభించింది. ఆమె ప్ర‌య‌త్నానికి కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌, పొరుగువారు స‌హామందిస్తున్నారు. చేతుల‌తో మాస్కులు కుట్టి అన్నింటినీ ఒక చోట చేర్చారు. 

ఈ ఫేస్‌మాస్కుల‌ను ఇత‌రుల‌కు స్వ‌యంగా పంచ‌కుండా సామాజిక దూరం పాటించేలా ఒక చెట్టును ఎంచుకున్నారు. ఈ మాస్కుల‌ను చెట్టుకు వేలాడ‌దీశారు. అవ‌స‌ర‌మైన వాళ్లు ఈ మాస్కుల‌ను స్వీక‌రించ‌గ‌ల‌రు అని ప్ర‌క‌టించారు. పేద‌ప్ర‌జ‌లంతా వీటిని తీసుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. 100 మాస్కులు త‌యారు చేయాల‌నుకున్న సెగ్గిన్స్ ల‌క్ష్యం అంత‌టితో అయిపోలేదు. మ‌రింత బాధ్య‌త ప పెరిగింది.  కిరాణా దుకాణ కార్మికులు, అగ్నిమాప‌క సిబ్బందికి కూడా సెగ్గిన్స్ మాస్కులు త‌యారు చేసి అందిస్తున్న‌ది. ఇలా క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు త‌న వంత ప్ర‌య‌త్నం చేస్తానంటున్న‌ది.


logo