శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 15:41:11

మ‌హిళ నుంచి పెంపుడు పిల్లి‌ని విడ‌దీసిన పేలుడు.. పాపం ఎంత ఏడ్చిందో!

మ‌హిళ నుంచి పెంపుడు పిల్లి‌ని విడ‌దీసిన పేలుడు.. పాపం ఎంత ఏడ్చిందో!

ఆగస్టు 4 న బీరుట్లో జరిగిన భారీ పేలుడులో 6,000 మంది గాయపడ్డారు మరియు 170 మందికి పైగా మరణించారు. దీనివ‌ల్ల ఎంతోమంది దూర‌మ‌య్యారు. ఆ విధంగా ఓ మ‌హిళ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లికి దూర‌మైంది. కొన్నిరోజుల త‌ర్వాత తిరిగి పిల్లిని క‌లుసుకోవ‌డంతో ఆమె ఆనందానికి హ‌ద్దుల్లేవు. అలాగే ఏడుపు కూడా ఆగ‌లేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ఈ వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఎమోష‌న‌ల్ వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. 'కొన్ని వారాల క్రితం నగరాన్ని కదిలించిన పేలుడు తర్వాత 100 మందికి పైగా బీరుట్ నివాసితులు తమ పెంపుడు జంతువులతో తిరిగి కలుసుకున్నారు'. క్లిప్‌లో మహిళ తన పెంపుడు పిల్లిని తిరిగి క‌లుసుకున్న త‌ర్వాత ఏడుస్తున్నట్లు చూపిస్తుంది. క్లిప్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 438 కే మంది వీక్షించారు.   


logo