గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 04, 2020 , 17:13:17

పాదాల ఫొటోలు అమ్ముతూ వారానికి రూ. 43వేలు సంపాదిస్తోంది!

పాదాల ఫొటోలు అమ్ముతూ వారానికి రూ. 43వేలు సంపాదిస్తోంది!

హైదరాబాద్‌: ప్రస్తుతం సోషల్‌మీడియాను ఆధారంగా చేసుకుని చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. విభిన్నమైన వ్యాపారాలకు సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో దీనిపై ఆధారపడినవారి సంఖ్యకూడా పెరిగింది. కాగా, ఓ యువతి తన పాదాల ఫొటోలు,వీడియోలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ వారానికి రూ. 43వేలు సంపాదిస్తోంది. 

జార్జియాకు చెందిన 23 ఏళ్ల కాసే తనకు వచ్చిన ఆలోచనను డబ్బుసంపాదనకు వినియోగించుకుంది. ఆమె వృత్తిరీత్యా మోడల్‌, రిసెప్షనిస్ట్‌. ఆన్‌లైన్‌లో చాలా మీమ్‌లను చూసిన తర్వాత ఫుట్‌ షెటిష్‌పై పరిశోధన చేసింది. ఫుట్ ఫెటిష్ మోడలింగ్‌ను ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె ఇన్‌స్టాలో ఒక పేజీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ పేజీకి 45,000 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. తన పాదాల ఫొటోలు, వీడియోలను డబ్బులు ఇచ్చినవాళ్లకు మాత్రమే కనిపించేలా సెటప్‌ చేసింది. దీంతో వారానికి 460 డాలర్లు వస్తున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo