ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 17:38:11

కుక్క‌బొచ్చుతో ఉంగ‌రాల జుట్టు తయారు చేసిన మ‌హిళ : ఫోటోలు వైర‌ల్‌!

కుక్క‌బొచ్చుతో ఉంగ‌రాల జుట్టు తయారు చేసిన మ‌హిళ :   ఫోటోలు వైర‌ల్‌!

ఓ మ‌హిళ త‌న క‌ళానైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి పెంచుకుంటున్న పెట్ కుక్క‌ను ఉప‌యోగించుకున్న‌ది. సాధార‌ణంగా ఆఫ్రిక‌న్స్ జుట్టు ఉంగ‌రాలు, రింగు రింగులుగా ఉంటుంది. కొంత‌మంది వారి హెయిర్‌స్టైల్‌ను ఫాలో అవుతారు. మ‌రికొంద‌రు విగ్ రూపంలో ధ‌రిస్తుంటారు. మ‌రి విగ్ కావాలంటే అచ్చం అలానే రూపొందించాలి క‌దా. అందుకు హెయిర్ స్టైలిస్ట్‌ క్రిస్సా రాజ్‌జీ  త‌న ద‌గ్గ‌రున్న కుక్క వెంట్రుక‌ల‌ను సేక‌రించి ఉంగ‌రాల జుట్టుగా త‌యారు చేసింది.

త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు కావాల్సిన విధంగా డ్రీడ్‌లాక్ హెయిర్ స్టైల్ రూపొందించింది. దీంతో ఆమెకు  ‘ప్రొఫెషనల్ డ్రీడ్‌లాక్ సోర్సెస్’ అని పిలిచే బిరుదు ల‌భించింది. త‌న క‌స్టమ‌ర్ జుట్టుకు కుక్క వెంట్రుక‌ల‌ను ఎలా నేయ‌గ‌లిగిందో పోస్ట్‌లో వివ‌రించింది. ఏదేమైనా ఆమె క్రిస్సా  తెలివితేట‌ల‌కు మెచ్చుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.  

  


logo