శనివారం 30 మే 2020
International - May 21, 2020 , 12:50:02

వెయ్యి కిలోల ఉల్లిగడ్డలతో ప్రియుడిపై ప్రతీకారం..

వెయ్యి కిలోల ఉల్లిగడ్డలతో ప్రియుడిపై ప్రతీకారం..

ఈ మధ్య ప్రేమించడం బ్రేకప్‌లు చెప్పుకోవడం సాధారణంగా మారిపోయింది. అలా అని అందరి ప్రేమను తప్పుపట్టలేం. ఇటీవల ఇద్దరు ప్రేమికులు విడిపోయారు. అయితే ప్రేయసి మాత్రం దీన్ని వదిలేయకుండా ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నది. ఏడాదిపాటు తమ పరిచయంలో బ్రేకప్‌ తర్వాత మూడు రోజుల పాటు ఇంట్లో కూర్చొని ఏడ్చింది అమ్మాయి. అతను మాత్రం సంతోషంగా ఉన్నాడు. దీనికి ఒక పథకం వేసింది. ప్రియుడి ఇంటిముందు 1000 కిలోల ఉల్లిగడ్డలు, ఓ ఉత్తరం రాసి పెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఇంటి మందు ఉన్న ఉల్లిగడ్డలను ఆ యువకుడు చూసి, పక్కనే ఉన్న ఉత్తరం తీసి చదివాడు. ‘ఇప్పటివరకు నేను ఏడ్చాను.. ఇప్పుడు నీ టర్న్‌' అని రాసి ఉంది. అంతేకాదు.. ఇరుగుపొరుగు వారిని కూడా ఇతని ఇంటి ముందు ఉల్లిగడ్డలు పెట్టమని చెప్పిందట. ఈ ఫొటోలు వైరల్‌ కావడంతో అతని పరువు పోవడమే తన ప్రతీకారం అయింటుందని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఎపుడూ తను చెప్పిందే నెగ్గాలనుకుంటుంది అందుకే బ్రేకప్‌ చెప్పేసా అని చైనాకు చెందిన యువకుడు బదులిచ్చాడు. ఏదైతేనేం అమ్మాయి ప్రతీకారం తీర్చుకున్నది. ఈ ఐడియా ఏదో బాగుందే అని కామెంట్లు పెడుతున్నారు. 


logo