మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Sep 26, 2020 , 19:29:01

10 గంట‌ల పాటు నిల‌బ‌డి చెట్టును కౌగిలించుకుంది! చివ‌రికీ..

10 గంట‌ల పాటు నిల‌బ‌డి చెట్టును కౌగిలించుకుంది! చివ‌రికీ..

గంట‌పాటు నిల‌బ‌డ్డానికే చ‌చ్చిపోతాం. అలాంటిది ఓ మ‌హిళ 10 గంట‌ల‌పాటు అలానే నిల‌బ‌డి ఉంది. అంత‌సేపు నిల్చున్నా ఆమె ముఖంలో చిరున‌వ్వు మాత్రం చెదిరిపోలేదు. ఆమె ఇన్ని గంట‌లు ఎందుకు నిల‌బ‌డింది. ఎవ‌రైనా ప‌నిష్‌మెంట్ ఇచ్చారా అనుకుంటారేమో! కాదు. ఈమె వ‌ర‌ల్డ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డానికి ఈ ప్ర‌య‌త్నం చేసింది. అనుకున్న దానిక‌న్నా ఎక్కువ‌సేపు నిల‌బ‌డి అంద‌రి ప్ర‌సంశ‌లు పొందింది. అడ్రియ‌న్ లాంగ్ అనే మ‌హిళ మ‌నుప‌టి రికార్డ్‌ను బ‌ద్ద‌లు కొట్టింది. ఇదివ‌ర‌కు 8 గంట‌ల 15 నిమిషాల‌తో బ్రేక్ చేయ‌గా ఈమె ఏకంగా 10 గంట‌ల 5 నిమిషాల‌తో గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో పేరు సంపాదించుకున్న‌ది. ఈ ఈవెంట్‌ను  'వరల్డ్ రికార్డ్ ట్రీ హగ్' అనే ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

అమెరికాలోని టేన‌స్సీ రాష్ట్రం, చ‌త్త‌నూగ అనే ప‌ట్ట‌ణంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. హెరిటేజ్ పార్కులో ఉన్న వాల్న‌ట్ చెట్టు వ‌ద్ద నిల్చొని అండ్రియ‌న్ త‌న రెండు చేతుల‌తో చెట్టును కౌగిలించుకొని నిల‌బ‌డింది. ప‌క్క‌నే డిజిట‌ల్ వాచ్ బోర్డును కూడా అమ‌ర్చారు. అడ్రియ‌న్ లాంగ్ స్నేహితుడు సారా అక్క‌డ కొన్ని కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించారు. అందులో మెడ్లీ యోగా, డ్యాన్స్‌, గైడెడ్ ధ్యానం మొద‌లైనవి ఉన్నాయి. అయితే.. 'అటవీ నిర్మూలన ప్రక్రియను ఆపడానికి కొంతమంది మహిళలు ప్రారంభించిన ‘చిప్కో ఉద్యమం’ గురించి అందరికీ తెలిసిందే. లాంగ్ కూడా అందుకోస‌మే ఈ ప్ర‌య‌త్నం చేసింది. దీని ద్వారా వ‌చ్చే ఆదాయం చ‌త్త‌నూగ ఆడుబోన్ సొసైటీకి వెళ్తుంద‌ని చెప్పుకొచ్చారు. 


logo