బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 03, 2020 , 15:16:47

క‌రోనా పాజిటివ్ అని తెలిసి గుండె ప‌గిలేలా ఏడ్చిన మ‌హిళ‌!

క‌రోనా పాజిటివ్ అని తెలిసి గుండె ప‌గిలేలా ఏడ్చిన మ‌హిళ‌!

క‌రోనా నేప‌థ్యంలో ఎవ‌రినీ న‌మ్మ‌డానికి వీళ్లేకుండా ఉంది. ఎదుటివాళ్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నా వారిని తాక‌డానికి కూడా వెనుకాడ‌తాం. అలాంటిది వారికే క‌రోనా పాజిటివ్ అని తెలిస్తే. కూల్‌గా ఉండ‌గ‌ల‌రా? గుండె ప‌గిలేలా ఏడ్చిందో మ‌హిళ‌.

బీజింగ్‌లో  షిజింగ్షాన్ వాండా ప్లాజాలోని ఒక మహిళ ఫోన్ మాట్లాడుతున్న‌ది. అక‌స్మాత్తుగా పెద్ద పెద్ద‌గా అరుస్తూ ఏడ‌వ‌డం మొద‌లుపెట్టింది. ఆమె స్వ‌రం ప్ర‌జ‌ల‌ను భ‌యానికి గురి చేసింది. ఆమెకు ఏమైందో అని అంద‌రూ ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. ఇంత‌లో నాకు క‌రోనా టెస్ట్‌లో పాజిటివ్ వ‌చ్చిందంటూ పెద్ద‌గా ఏడ్వ‌సాగింది. ఇది తెలియ‌గానే అక్క‌డివాళ్లంతా ప‌రుగులు తీశారు. బాధ‌ను త‌ట్టుకోలేక అక్క‌డే కూల‌బ‌డింది. ఇదంతా ఒక వీడియోలో రికార్డ్ అయింది. ఆ త‌ర్వాత ఆమె ప్లాజా ఎంట్రీ పాయింట్ ద‌గ్గ‌ర అంద‌రికీ దూరంగా కూర్చున్న‌ది. ఇంత‌లో ఆమెను తీసుకెళ్ల‌డానికి పీపీఈ కిట్లు ధ‌రించిన‌ ఆరోగ్య సిబ్బందితోపాటు అంబులెన్స్ కూడా వ‌చ్చింది. ఈ సంఘ‌ట‌న‌ను మ‌రొక వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo