ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 14, 2020 , 20:15:24

ఆకాశంలో పుట్టాడ‌ని 'స్కై' అని పేరు పెట్టిన త‌ల్లి.. మ‌రి బ‌ర్త్ ప్లేస్ ఎక్క‌డంటే!

ఆకాశంలో పుట్టాడ‌ని 'స్కై' అని పేరు పెట్టిన త‌ల్లి.. మ‌రి బ‌ర్త్ ప్లేస్ ఎక్క‌డంటే!

ఈ మ‌ధ్య జ‌నాల క్రియేటివిటీతో పిచ్చెక్కిస్తున్నారు. క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచి వింత పేర్లు వినిపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో డెలివ‌రీ అయిన మ‌హిళ‌లు వారి పిల్ల‌ల‌కు క‌రోనా, లాక్‌డౌన్, వైర‌స్ లంటూ వింత పేర్ల‌ను పెట్టుకున్నారు. ఇదే ట్రెండ్ అన్న‌ట్లు భావిస్తున్నారు. ఇటీవ‌ల ఓ మ‌హిళ కూడా అలానే చేసింది. అయితే ఈమె క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన పేరు పెట్ట‌లేదు. త‌న బిడ్డ‌కు 'స్కై' అని నామ‌క‌ర‌ణం చేసింది. అదేంటి అనుకుంటున్నారా?  దీనికి పెద్ద కార‌ణ‌మే ఉంది.

అల‌స్కాకు చెందిన చ్రెస్టాల్ హిక్స్ అనే గ‌ర్భిణీ మ‌హిళ ఒక‌రోజు విమానంలో ప్ర‌యాణిస్తున్న‌ది. అప్పుడే నొప్పులు మొద‌లైయ్యాయి. విమానానికి, భూమికి మ‌ధ్య సుమారు 18 వేల అడుగుల ఎత్తులో ఉండ‌డంతో విమానాన్ని ఆపేందుకు వీలు లేక‌పోయింది. పోనీ ద‌గ్గ‌ర‌గా ఉండే విమానాశ్ర‌యంలో ఆపేలోపే పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప‌నైపోయింది క‌దా అని ఆమె చేరాల్సిన గ‌మ్యానికే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇప్పుడు వ‌చ్చిన చిక్కుల్లా ఒక‌టే.. బ‌ర్త్ స‌ర్టిఫికేట్‌లో బిడ్డ పుట్టిన ప్రాంతం రిజిస్ట‌ర్ చేయ‌డానికి ఏం రాయాలో త‌ల్లికి అర్థం కాలేదు. చేసేదేంలేక ఆమె న‌గ‌రం అయిన ఆంక‌రేజ్ పేరునే రిజిస్ట‌ర్ చేయించింది. మొత్తానికి బిడ్డ పూర్తి పేరు  ‘స్కై ఐరోన్ హిక్స్’ అని పెట్టింది.


logo