బుధవారం 27 జనవరి 2021
International - Jan 08, 2021 , 01:43:30

‘మమ్మల్ని ఏదీ ఆపలేదు’ అంటూ తూటాకు బలి

‘మమ్మల్ని ఏదీ ఆపలేదు’ అంటూ తూటాకు బలి

వాషింగ్టన్‌: యూఎస్‌ క్యాపిటల్‌ ముట్టడి సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన మహిళను ఆష్లీ బాబిట్‌గా గుర్తించారు. అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత బలమైన మద్దతుదారుగా ఉన్న ఆష్లీ కొంతకాలం అమెరికా వాయుసేనలో పనిచేశారు. వాషింగ్టన్‌లో క్యాపిటల్‌ ముట్టడికి వచ్చే ముందు మంగళవారం ఆమె ట్విట్టర్‌లో ‘మమ్మల్ని ఏదీ ఆపలేదు.. వారు ఎంత ప్రయత్నించినా 24 గంటలలోపు రాజధాని నగరంపైకి తుఫాను వచ్చేస్తున్నది’ అంటూ ట్వీట్‌ చేశారు. భవనాన్ని ముట్టడించిన సమయంలో ఆమె కిటికీ అద్దాలు బద్దలు కొట్టి చాంబర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఓ పోలీస్‌ అధికారి ఆమెను ఛాతీలో కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆష్లీ.. ఆ తరువాత మరణించారు. logo