బుధవారం 20 జనవరి 2021
International - Jan 02, 2021 , 14:41:49

ప్రేమను అంగీకరించి.. కొండ పైనుంచి పడిన మహిళ

ప్రేమను అంగీకరించి.. కొండ పైనుంచి పడిన మహిళ

వియన్నా: ప్రియుడు చేసిన ప్రేమ ప్రతిపాదనకు ఒక మహిళ అంగీకారం తెలిపింది. అంతలోనే కొండ అంచు నుంచి జారి కిందకు పడింది. అయితే ఆమె పడిన ప్రాంతంలో భారీగా మంచు ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియుడు కూడా కొండ అంచుకు చిక్కుకుని వేలాడగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఆస్ట్రియాలోని కారింథియాలో ఈ ఘటన జరిగింది.

32 ఏండ్ల మహిళ, 27 ఏండ్ల వ్యక్తి ప్రేమలో ఉన్నారు. డిసెంబర్‌ 26న వారిద్దరు ఫాల్కర్ట్ పర్వతాన్ని అధిరోహించారు. ఆ మరునాడు ఇద్దరు శిఖరానికి చేరుకున్నారు. అక్కడ ఆ వ్యక్తి ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. దానికి ఆమె అంగీకరం తెలిపారు. అంతలోనే ఆ మహిళ కొండ అంచు నుంచి జారి 650 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. మంచుపై పడి కదలలేని స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కొందరు రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. 

మరోవైపు పడిపోతున్న ప్రియురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియుడు కూడా కొండ అంచున చిక్కుకుని గాల్లో వేలాడాడు. హెలికాప్టర్‌లో వచ్చిన రెస్క్యూ సిబ్బంది వారిద్దరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మంచు వల్ల ప్రాణాలతో బయటపడ్డ ఆ ప్రేమికులు అదృష్టవంతులని పోలీసు అధికారి తెలిపారు. శీతాకాలం కాకపోయి ఉండే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo