శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 17:05:04

పారాగ్లైడింగ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకోవాలనుకుంది.. కానీ ఐఫోన్‌ 11ప్రో నీటిలో పడిపోయింది..!

పారాగ్లైడింగ్‌ చేస్తూ సెల్ఫీ తీసుకోవాలనుకుంది.. కానీ ఐఫోన్‌ 11ప్రో నీటిలో పడిపోయింది..!

న్యూయార్క్‌: పారాగ్లైడింగ్‌, స్కైడైవింగ్‌ లేదా స్కీయింగ్‌ చేసేటప్పుడు ఫోన్‌ తీసుకెళ్లడం మంచిదికాదు. ఇలాంటి సమయాల్లో ఫోన్లు దూరంగా ఉంచాలని నిపుణులు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. అయినా కొందరు తమ సాహసయాత్రను తమ స్వహస్తాలతో చిత్రీకరించాలని ఉబలాటపడుతుంటారు. ఇలాగే, ఆశపడి తన అడ్వెంచర్‌ను స్వయంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన ఐఫోన్‌ 11ప్రో ఫోన్‌ను తీసుకెళ్లిన ఓ మహిళ దానిని జారవిడుచుంది.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

ఆల్ప్స్ పర్వతాల మీదుగా పారాగ్లైడింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీ స్టిక్‌లో తన ఐఫోన్‌ను ఉపయోగించాలని  ఒక అమెరికన్ మహిళ భావించింది. పారాగ్లైడింగ్ అనుభవాన్ని డాక్యుమెంట్ చేయడానికి ఆమె తన సరికొత్త ఐఫోన్ 11 ప్రోని ఉపయోగించింది. ఆమె సెల్ఫీ స్టిక్ తో తన పరికరాన్ని పట్టుకుంది. సెల్ఫీ స్టిక్ ను మరో చేతికి మార్చడానికి ప్రయత్నించినప్పుడు, అది జారి 5,000 అడుగుల దిగువకు పడిపోయింది. దీంతో ఏంచేయలేక బిక్కుబిక్కుమంటూ చూస్తున్న మహిళకి సంబంధించిన వీడియో ఆమెతోపాటున్న సహాయకుడి మొబైల్‌లో రికార్డు అయ్యింది. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పారాగ్లైడ్‌ చేస్తూ సెల్ఫీస్టిక్‌లో కొత్త ఐఫోన్‌ వాడాలనుకోవడం ఆమె చేసిన చెడ్డ ఆలోచన అని పలువురు కామెంట్ చేశారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo