గురువారం 26 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 17:53:03

పెంపుడు కుక్క కోసం 2,220 కిలోమీటర్లు వెళ్లారు..!

పెంపుడు కుక్క కోసం 2,220 కిలోమీటర్లు వెళ్లారు..!

టెక్సాస్‌: పెంపుడు కుక్క అంటే వారికి ప్రాణం. అయితే, అది ఆరేళ్ల క్రితం తప్పిపోయింది. ఇటీవల ఓ హ్యుమన్‌ సొసైటీ సహకారంతో దొరికింది. వారు సమాచారం అందించగానే ఆ కుటుంబం దూరాన్ని కూడా లెక్కచేయలేదు. వెంటనే ప్రయాణం ప్రారంభించారు. పెంపుడు కుక్క కోసం  2,220 కిలోమీటర్లు ప్రయాణించి తమ ప్రేమను చాటుకున్నారు.

2014 జూన్‌లో వాజ్క్వెజ్, ఆమె కూతురు డానే తమ మూడు కుక్కలను శాన్ ఆంటోనియోలోని వారి యార్డ్ నుంచి బయటకు వదిలారు. మళ్లీ పిలిచినప్పుడు రెండు కుక్కలు మాత్రమే తిరిగివచ్చాయి.  వారి చివావా మిక్స్ కింగ్ అనే కుక్క రాలేదు. దీంతో కంగారుపడ్డ ఆ కుటుంబం ఆ ప్రాంతమంతా గాలించింది.. పక్కవీధిలో కూడా వెదికింది. సందులు, మూలలు, రంధ్రాలన్నింటినీ వడపోసింది. హ్యుమన్ సొసైటీ కార్యాలయానికి వెళ్లి చూశారు. కానీ కుక్క జాడ తెలియలేదు.  దీంతో బాధలో మునిగిపోయారు. కానీ దాన్ని మరిచిపోలేదు. ఈ ఏడాది అక్టోబర్ 25 న వాజ్క్వెజ్‌కు ఒక వాయిస్‌ మెయిల్‌ వచ్చింది. ఫోర్ట్ లాడర్డేల్‌లోని బ్రోవార్డ్ కౌంటీ హ్యుమన్‌ సొసైటీ నుంచి అది వచ్చింది. తప్పిపోయిన కుక్క దొరికింది అని దాని సారాంశం. స్కాన్‌ చేసిన చిన్న చిప్‌ ఆధారంగా దాన్ని గుర్తించారట. ఈ సమాచారం అందిన వెంటనే వాజ్క్వెజ్, తన కూతురును తీసుకొని 2,200 కిలోమీటర్లు ప్రయాణించింది.  ఈ వార్త అమెరికాలో వైరల్‌ అయ్యింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.