ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 13:53:32

ఈ సాలీడు పురుగుకి ఎటు చూసినా క‌ళ్లే.. మొత్తం ఎనిమిది!

ఈ సాలీడు పురుగుకి ఎటు చూసినా క‌ళ్లే.. మొత్తం ఎనిమిది!

ఇల్లు అన్నాక మ‌నుషులు ఉంటారో లేదో కాని సాలీడు పురుగులు మాత్రం హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. శుభ్రంగా పెట్టుకునే ఇంటిని పాడు చేయ‌డానికి సాలీడు పురుగులు ముందుంటాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు చాలా సాలీడుల‌ను చూసుంటారు. కానీ ఈ త‌ర‌హా సాలీడుని ఎప్పుడూ చూసుండ‌రు. ఎందుకంటే సాధార‌ణంగా సాలీడుకి ఎనిమిది కాళ్లుంటాయి. కానీ దీనికి కాళ్ల‌తో పాటు క‌ళ్లు కూడా ఎనిమిది ఉన్నాయి. ఎదురుగా చూస్తున్న‌ప్ప‌టికీ వెనుక ఏం జ‌రుగుతుందో దీనికి క‌నిపిస్తుంది. ఒక మాట‌లో చెప్పాలంటే ఈ సాలీడు 360 డిగ్రీల త‌ర‌హాలో ఎటువైపు అయినా చూడొచ్చు.

ఆస్ట్రేలియాలోని తిరోల్‌లో అమాండా డే జార్జ్ అనే ప్ర‌కృతి ప్రేమికురాలు ఈ వింత సాలీడును త‌న కెమెరాలో బంధించింది. 4 మి.మీ. పొడ‌వున్న ఈ సాలీడుకు సంబంధించిన కొన్ని ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. నిపుణులు సైతం ఈ సాలీడు గురించి చెప్ప‌లేక‌పోతున్నారు. అందుకే మీకు ఏమైనా తెలుసో లేదో ఒక‌సారి చూసి చెప్పండి. 


logo