మంగళవారం 20 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 11:44:28

వామ్మో.. ఓ కంటైన‌ర్‌లో రెండు త‌ల‌ల‌పాము ఏం చేసిందంటే!

వామ్మో.. ఓ కంటైన‌ర్‌లో రెండు త‌ల‌ల‌పాము ఏం చేసిందంటే!

ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌లో క‌నిపించే పాముల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో ట్విట‌ర్ నిండిపోయింది. కొన్ని వీడియోలు భ‌యానికి గురి చేసినా మ‌రికొన్ని ర‌క‌ర‌కాల పాములు ఎలా ఉంటాయో తెలియ‌జేస్తుంది. ఒక మ‌హిళ త‌న ఇంట్లో రెండు త‌ల‌ల పామును గుర్తించింది. వెంట‌నే దీనిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాసేప‌టికే ఈ క్లిప్ వైర‌ల్ అయింది. ఈ పాము చాలా చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికీ త‌ల‌ల‌ను చూస్తే వ‌ళ్లు జ‌ల‌ద‌రిస్తుంది. ఈ పాము పె‌ద్ద‌దైన త‌ర్వాత చూస్తే భ‌య‌ప‌డ‌టం ఖాయం.

నార్త్ క‌రోలినాకు చెందిన జెన్నీ విల్స‌న్ ఈ పామును క‌నుగొన్న‌ది. ఒక కంటైన‌ర్‌లో చెత్త‌తో పాటు పాము తార‌స‌ప‌డింది. మ‌రి ఆ పాము అందులోకి ఎలా చేరిందో ఆమెకు కూడా అర్థం కాలేదు. కంటైన‌ర్‌లో పాము కొంచెం ఫ్రీగా తిరిగేందుకు గ‌డ్డిని ప‌క్క‌కు నెట్టింది. ఈ అరుదైన వీడియో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. జెన్నీ రెండు త‌ల‌ల‌పామును 'డ‌బుల్ ట్ర‌బుల్' అని పిలిచింది. విష‌పూరిత‌మైన పామును ఎక్క‌డైనా దూరంగా వ‌దిలేయండి లేదంటే ప్ర‌మాదం అని త‌న స్నేహితులు సూచించారు.  


logo