గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 08, 2020 , 16:51:16

క‌బాబ్ కోసం 75 కి.మీ. ప్ర‌యాణించిన మ‌హిళ‌.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది!

క‌బాబ్ కోసం 75 కి.మీ. ప్ర‌యాణించిన మ‌హిళ‌.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది!

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బ‌య‌ట ఫుడ్ తినాల‌న్నా భ‌య‌మేస్తుంది. లాక్‌డౌన్ ఉన్న‌న్నిరోజులు త‌మ నోటికి తాళం వేసిన‌ట్లే ఉంద‌ని చెప్పుకొచ్చారు ఆహార ప్రియులు. ఇంట్లో ఎంత మంచిగా వంట చేసుకున్న బ‌య‌ట దొరికేంత టేస్ట్ అయితే రాదు. ముఖ్యంగా బిర్యానీ. దానికోసం త‌పించిపోయేవాళ్లు. ఇప్పుడు ఆ బాధ లేదు. క‌రోనా భ‌యం ఉన్న‌వాళ్లు మానుకున్నా మిగిలిన వాళ్లు మాత్రం బ‌య‌ట తెచ్చుకొని కుమ్మేస్తున్నారు. కానీ ఆస్ట్రేలియాలో ఇంకా లాక్‌డౌన్ న‌డుస్తున్న‌ది. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఓ మ‌హిళ‌కు జ‌రిమానా విధించారు పోలీసులు.

ఆక‌లితో ఉన్న ఓ మ‌హిళ త‌న ఇంటి నుంచి క‌బాబ్ కోసం 75 కి.మీ. దూరం ప్ర‌యాణించింది. మెల్‌బోర్న్‌లోని వెర్రిబీలో మ‌హిళ‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు ప్ర‌శ్నించ‌గా ఆమె క‌బాబ్ తిన‌డానికి జిలాంగ్ నుంచి మెల్‌బోర్న్‌కు వెళ్లిన‌ట్లు చెప్పింది. కానీ అక్క‌డ ప్ర‌జ‌లు ప‌ని, వైద్య సంర‌క్ష‌ణ కోసం మాత్ర‌మే ఇంటి నుంచి బ‌యట‌కు వ‌చ్చేందుకు అనుమ‌తి ఉంది. కానీ ఇలా తిండి కోసం రోడ్డు మీద ప్ర‌యాణించ‌డం నేర‌మ‌ని ఆ మ‌హిళ‌కు జ‌రిమానా విధించారు. అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇదేం మొద‌టిసారి కాదు.   


logo