మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 17:54:11

పిల్లి పచ్చబడింది.. ఎందుకో తెలుసా?

పిల్లి పచ్చబడింది.. ఎందుకో తెలుసా?

బ్యాంకాక్‌: ఓ తెల్లపిల్లి పసుపుపచ్చగా మారిపోయింది! ఇదేదో కనికట్టు కాదులెండి.. దాని యజమాని దాన్ని అలా మార్చేసిందట. సరదాకు ఆమె ఇలా చేయలేదు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌నుంచి పిల్లిని కాపాడేందుకు దానికి ఒళ్లంతా పసుపు పూసిందట. ఆ రంగులోకి మారిన పిల్లిని చూసి యజమానికి భలే ముచ్చటనిపించి, ఫొటో తీసింది. దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యింది.

థాయిలాండ్‌కు చెందిన తమ్మపా సుపమాస్‌ అనే మహిళ ఓ పిల్లిని పెంచుకుంటున్నది. అయితే, దానికి ఇటీవల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. దాన్ని తగ్గించేందుకు సుపమాస్‌ పిల్లికి పసుపు దట్టించింది. అప్పుడు అది పూర్తిగా పసుపురంగులోకి మారిపోయిందట. దానికి కొన్ని మెరుగులద్ది పోకెమాన్‌లాగా తీర్చిదిద్దింది సుపమాస్‌. పిల్లి ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టగా, వైరల్‌ అయ్యింది. 3,000 మంది ఈ ఫొటోను షేర్‌ చేయగా,  2,600 లైక్స్‌ వచ్చాయట. సంపాదించింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo