గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 25, 2020 , 08:41:46

విమానం ఎగ‌రాలంటే మాస్క్ ఉండాల్సిందే

విమానం ఎగ‌రాలంటే మాస్క్ ఉండాల్సిందే

వాషింగ్ట‌న్‌: దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో మాస్కు ధ‌రిస్తేనే విమానాల్లో ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిస్తామ‌ని అమెరికా విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌క‌టించాయి. రెండేండ్ల లోపు చిన్నారుల‌కు మాత్ర‌మే దీనినుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించాయి. ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించాల‌ని తాను ప్ర‌క‌టించ‌న‌ని అధ్య‌క్షుడు ట్రంప్ చెప్పిన‌ప్ప‌ట్టికి, మాస్కుల‌కు సంబంధించి విదివిధానాల‌ను రూపొందించ‌డంలో విమాన‌యాన సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం సేచ్ఛ‌నిచ్చింది. దీంతో మాస్కులుంటేనే విమానాలు ఎగురుతాయ‌ని, ప్ర‌యాణికుల‌కు మాస్కును త‌ప్ప‌నిస‌రిచేస్తూ అమెరిక‌న్‌, డెల్టా, సౌత్‌వెస్ట్‌, యునైటెట్ ఎయిర్‌లైన్స్ స‌రికొత్త నిబంధ‌న‌ల‌ను ప్ర‌క‌టించాయి. 

ఎలాంటి ఫేస్ మాస్క్ ధ‌రించినా ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తిస్తామ‌ని డెల్టా సంస్థ ప్ర‌క‌టించింది. అయితే వాటికోసం ప్ర‌త్యేక‌ స్క్రీనింగ్ ఉంటుంద‌ని, దానికి గంట‌కుపైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని వెల్ల‌డించింది. మాస్కు ధ‌రించ‌డానికి నిరాక‌రించిన 100 మందిని విమానంలో ప్ర‌యాణించ‌డానికి అనుమ‌తించలేద‌ని, మాస్కు లేనివారికి ఉచితంగా వాటిని అందించామ‌ని డెల్టా సీఈవో ఎడ్ బాస్టియ‌న్ చెప్పారు. 

దేశంలో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికే 1,48,490 మందికిపైగా వ‌ర‌ణించగా, 42,48,327 మంది ఈ మ‌హమ్మారి బారిన‌ప‌డ్డారు.


logo