ఆదివారం 05 జూలై 2020
International - Jun 22, 2020 , 07:02:27

ప్రజామద్దతు ఉంటే ఇలాగే కొనసాగుతా: పుతిన్‌

ప్రజామద్దతు ఉంటే ఇలాగే కొనసాగుతా: పుతిన్‌

మాస్కో: రాజ్యాంగంలో సవరణలు చేయడానికి ప్రజలు తమ మద్దతు తెలిపితే మరికొంత కాలం అధ్యక్షుడిగా పని చేయడానికి తనకేమీ ఇబ్బంది లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన మనసులో మాటను బయటపెట్టారు. రాజ్యాంగానికి సవరణలను ప్రతిపాదిస్తూ ఈనెల 25 నుంచి జూలై 1 వరకు రష్యాలో ప్రజా ఓటింగ్‌ నిర్వహించనున్నారు. 

పుతిన్‌ అధ్యక్ష కాలం 2024తో ముగియనున్నది. ఆయన మరో రెండు పర్యాయాలు (మరో 12 సంవత్సరాలు) అధ్యక్షుడిగా ఉండేలా పేర్కొంటూ ప్రతిపాదించిన అంశాలు కూడా రాజ్యాంగ సవరణలో చేర్చారు. ఈ క్రమంలోనే ప్రజల మద్దతు ఉంటే మరికొంతకాలం అత్యున్నత పదవిలో కొనసాగుతానని వాఖ్యానించారు. కాగా 2036 వరకు అధ్యక్ష హోదాలో కొనసాగాలన్న పుతిన్‌ కోరికపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇది రాజ్యాంగ తిరుగుబాటు చర్యేనని అభివర్ణించాయి.


logo