ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 19:25:07

అమెరికాలో కొత్తగా 58,173 కరోనా పాజిటివ్‌ కేసులు

అమెరికాలో కొత్తగా 58,173 కరోనా పాజిటివ్‌ కేసులు

వాషింగ్టన్: కరోనా అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తూనే ఉంది. ఆ దేశంలో 24 గంటల్లోనే 58,173 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ వర్సిటీ తెలిపింది. దీంతో ఆ దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య  4.9 మిలియన్లకు పెరిగినట్లు వెల్లడించింది. 

యూఎస్‌లో ఒక్కరోజే 1,243 మరణాలు నమోదయ్యాయని వర్సిటీ తెలిపింది. దేశంలో మొదటి కేసు 22.01.2020న 198 రోజుల క్రితం నమోదైందని, అప్పటినుంచి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో దేశం 5 మిలియన్ల పరిమితిని దాటుతుందని భావిస్తున్నామని పేర్కొంది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo