శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 20, 2020 , 16:50:44

రష్యాలో కరోనా విలయం

రష్యాలో కరోనా విలయం

మాస్కో :  రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులతో కలవరపెడుతోంది. తాజాగా సోమవారం ఒక్కరోజే ఆ దేశంలోని 85 ప్రాంతాల్లో 5,940 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,77,486కు చేరింది. ఇక కోవిడ్‌ మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఆ దేశంలో 85 మంది మృతి చెందగా ఇప్పటివరకు 12,427 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఏప్రిల్‌ 29 తరువాత ఒకేరోజు దాదాపు 6 వేల కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అంతకుముందు ఒక్కరోజులో రికార్డుస్థాయిలో 5,841 కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన 5,940 పాజిటివ్‌ కేసుల్లో 1,556 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కోవిడ్‌ స్పందనా కేంద్రం ప్రకటించింది. రష్యాలో నిత్యం కరోనా సంక్రమణ 0.8శాతం పెరుగుతోందని తెలిపింది.
 


logo