శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 15:14:25

రోడ్డుపాలైన 50 వేల లీటర్ల రెడ్‌ వైన్‌.. వీడియో వైరల్‌

రోడ్డుపాలైన 50 వేల లీటర్ల రెడ్‌ వైన్‌.. వీడియో వైరల్‌

ఇటీవల ఇటలీలోని ఓ చిన్న గ్రామంలో తలెత్తిన సాంకేతిక కారణంతో గ్రామంలోని నల్లాల్లో రెడ్‌వైన్‌ ప్రవహించి ఆశ్చర్యంలో ముంచెత్తగా.. ఇటాలియన్ ప్రావిన్స్ ట్రెవినోలోని వెనెటోకు సమీపంలో ఉన్న కోనెగ్లియానోలో భారీ కంటైనర్‌ నుంచి రెడ్‌ వైన్‌ ఫౌంటెన్‌లా పొంగిపొర్లింది. కాగా, స్పెయిన్‌లో వైనరీ ట్యాంక్‌ పేలుడు కారణంగా 50 వేల లీటర్ల రెడ్‌వైన్‌ రోడ్డును ముంచెత్తింది.

స్పెయిన్‌లోని వైన్‌ నిల్వ ట్యాంక్ దెబ్బతిని పేలిపోవడంతో స్పెయిన్ విల్లమాలియాలో 50 వేల లీటర్ల రెడ్ వైన్ రోడ్డుపై గోదావరిలా పారింది. రెడ్ వైన్ లోహపు వ్యాట్ నుండి బయటకు వెళ్లి ఫ్యాక్టరీ మైదానంలో వరదల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రెడ్ వైన్ కంటైనర్ నుంచి బయటకు వెళ్లి ఉద్యోగులు నిస్సహాయంగా చూస్తుండటంతో ఆ ప్రాంతాన్ని వరద మాదిరిగా ముంచెత్తింది. పేలుడు వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియకపోయినా, ఒక వ్యాట్స్‌లో దెబ్బతినడమే కారణం కావచ్చునని స్థానిక మీడియా నివేదించింది. ఈ విషాద సంఘటన ఐబీరియన్ ద్వీపకల్పానికి ఆగ్నేయంలో ఉన్న విటివినోస్ వైనరీలో జరిగింది. 1969 నుంచి ఉన్న ఈ వైన్‌ తయారీకేంద్రంలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి.

ఈ క్లిప్‌ను సెప్టెంబర్ 25 న స్థానిక రేడియో స్టేషన్ రేడియో అల్బాసెట్ ట్విట్టర్‌లో పంచుకోగా.. 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ పొందింది. కొందరు నెటిజెన్లు 1980 నాటి భయానక చిత్రం 'ది షైనింగ్' లోని దృశ్యాలను ఈ ఐకానిక్ సన్నివేశంతో పోల్చారు. ఈ ఏడాది తొలినాళ్లలో 1,00,000 గ్యాలన్ల క్యాబెర్నెట్ సావిగ్నాన్ కాలిఫోర్నియా నదిలోకి చిందగా.. సోనోమా కౌంటీ ద్రాక్షతోటలోని ఒక ట్యాంక్ నుండి 97 వేల గ్యాలన్ల రెడ్ వైన్ లీకై రోడ్డుపాలైంది. logo