శనివారం 31 అక్టోబర్ 2020
International - Sep 27, 2020 , 12:45:45

న‌దిలా పొంగిపొర్లుతున్న 50,000 లీ. రెడ్‌వైన్! ఎక్క‌డంటే..?

న‌దిలా పొంగిపొర్లుతున్న 50,000 లీ. రెడ్‌వైన్! ఎక్క‌డంటే..?

స్పెయిన్‌లో 50,000 లీ. రెడ్‌వైన్ ఉన్న ట్యాంక్ పేల‌డంతో రెడ్‌వైన్ పొంగి పొర్లింది. అక్క‌డున్న కొంత‌మంది ఉద్యోగులు ఏం చేయ‌లేక వీడియో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి మందుబాబులు ఏడ‌వ‌డం ఖాయం. రెడ్‌వైన్ అంతా మ‌ట్టిపాలు అయిందే అని ల‌బోదిబోమ‌ని కొట్టుకుంటారు. అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఇక్క‌డ కాదు కాబ‌ట్టి కాస్త రిలాక్స్ అవుతున్నారు. లేదంటే ఆ ప్ర‌దేశానికి ప‌రుగులు పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు. 

49 నిమిషాల పాటు న‌డిచే ఈ వీడియోలో రెడ్‌వైన్ నీరులా పారుతున్న‌ది. డ్యామ్ నుంచి నీటిని వ‌దిలితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంది. కాక‌పోతే ఇది రెడ్‌వైన్ కాబ‌ట్టి ఎర్ర‌గా ర‌క్తంలా ఉంది. ఈ విషాద సంఘ‌ట‌న ఐబీరియ‌న్ ద్వీప‌క‌ల్పానికి ఆగ్నేయంలో ఉన్న విటివినోస్ వైన‌రీలో జ‌రిగింది. 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. ఈ వీడియోను రేడియో అల్బాసెట్ ట్విట‌ర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను 8.4 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఇదిలా జ‌రుగుతుంటే అక్క‌డున్న ఉద్యోగులు ఏమీ చేయ‌లేక‌పోయారు.