శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 20, 2020 , 17:09:25

హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ ఇంటికి సద్గురు..!

హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ ఇంటికి సద్గురు..!

న్యూయార్క్‌: హాలీవుడ్‌ నటుడు విల్‌స్మిత్‌ కుటుంబం ఇశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ను కలుసుకుంది. జగ్గీవాసుదేవ్‌ తన ‘అమెరికాలో బైక్‌యాత్ర’లో భాగంగా విల్‌స్మిత్‌ ఇంటికి వెళ్లారు. వారితో కలిసి దిగిన ఫొటోలను సద్గురు సోషల్‌మీడియాలో షేర్‌ చేయగా, వైరల్‌ అవుతున్నాయి. ‘విల్, మీతో, మీ అద్భుతమైన కుటుంబంతో కొంతసేపు గడపడం చాలా ఆనందంగా ఉంది. మీ కుటుంబమంతా క్షేమంగా ఉండాలి. ధర్మం మీకు మార్గదర్శిగా ఉంటుంది.’ అని సద్గురు ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.  

అలాగే, సద్గురుతో కలిసి ఉన్న వీడియోను స్మిత్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ‘సద్గురు పట్టణంలో ఉన్నారు. నేను ఆయనను కొంతకాలంగా ఫాలో అవుతున్నాను. ఆయన ‘ఇన్నర్ ఇంజినీరింగ్’ అనే అద్భుతమైన పుస్తకం రాశారు. నా కుటుంబం ఆధ్యాత్మిక వ్యక్తులను కలవాలని నేను కోరుకుంటున్నాను’ అని స్మిత్ పేర్కొన్నారు. అమెరికా అంతటా మీ మోటార్‌సైకిల్‌ ప్రయాణాన్ని ఆనందించండి అని రాశారు స్మిత్‌. కాగా, సద్గురు జగ్గీవాసుదేవ్‌ యునైటెడ్ స్టేట్స్ అంతటా 10,000 మైళ్ల మోటారుసైకిల్ యాత్ర చేపట్టారు.