బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Feb 24, 2020 , 11:16:04

మరికొద్ది గంటల్లో అందర్నీ కలుస్తా: ట్రంప్‌

మరికొద్ది గంటల్లో అందర్నీ కలుస్తా: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇవాళ భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన రాక కోసం యావత్‌ భారతావని.. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వాసులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ఫాలో అవుతున్న ట్రంప్‌.. దారిలో ఉన్నా.. మరి కొద్ది గంటల్లో మీ అందర్నీ కలుస్తాననీ.. భారత్‌కు ఎప్పుడెప్పుడు వెళ్తానా అని ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి భారత పర్యటనకు రావడంతో ప్రధానితో పాటు సామాన్యులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించనున్న మొతెరా స్టేడియం జనాలతో నిండిపోయింది. ఎయిర్‌పోర్టు, స్టేడియం వెలుపల ఆయనకు స్వాగతం పలికేందుకు అనేక మంది నాయకులతో పాటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు ఇరు దేశాల జాతీయ జెండాలు చేతబూని ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ పర్యటనలో ట్రంప్‌.. తన సతీమణి మెలానియా ట్రంప్‌తో పాటు, కుమార్తె ఇవాంకా ట్రంప్‌, అల్లుడు కుష్నర్‌, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో వస్తున్నారు. 


logo