శనివారం 30 మే 2020
International - May 07, 2020 , 11:38:05

2500 మీట‌ర్ల ఎత్తులో కెమెరాకు చిక్కిన వన్య‌ప్రాణులు..వీడియో

2500 మీట‌ర్ల ఎత్తులో కెమెరాకు చిక్కిన వన్య‌ప్రాణులు..వీడియో

నేపాల్, భూటాన్ లోని ఎత్తైన ప్రాంతాల్లో ఎప్పుడూ క‌నిపించ‌ని వన్య‌ప్రాణులు గ్రామ‌స్థుల కంట‌ప‌డ్డాయి. స‌ముద్ర‌మ‌ట్టానికి 2500 మీట‌ర్ల‌లో ఎత్తులో నేపాల్‌లోని ద‌డేల్దురా అడ‌వుల్లో చిరుతను చూసిన మ‌హాభార‌త్ రీజియ‌న్ లోని స్థానికులు ఫారెస్ట్ అధికారుల‌కు స‌మాచార‌మందించారు.

నేపాల్ లో చిరుత తిరుగుతున్న దృశ్యాలు కెమెరా కంట ప‌డ్డాయి. మ‌రోవైపు  భూటాన్ లో 4 వేల మీట‌ర్ల ఎత్తులోని అట‌వీ ప్రాంతంలో మ‌రో పులి చ‌క్క‌ర్లు కొడుతూ క‌నిపించింది. ఈ ప్రాంతాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని భావించిన జీవశాస్త్ర‌వేత్త‌లు ఒక నెల‌లోనే 62 కెమెరాలు బిగించారు.

గోల్డెన్ జాక‌ల్ (ద‌క్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆగ్నేయ యూర‌ప్ లో క‌నిపించే న‌క్క‌), చిరుత‌, లియోఫార్డ్ క్యాట్‌, బ్రౌన్ గోర‌ల్ జంతువుల తిరుగుతున్న దృశ్యాలు కెమెరాల్లో బంధించ‌బ‌డ్డాయి. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo