బుధవారం 03 జూన్ 2020
International - May 13, 2020 , 18:01:18

ఎర్ర‌మ‌ట్టిలో హోలీ ఆడుతున్న ఏనుగులు

ఎర్ర‌మ‌ట్టిలో హోలీ ఆడుతున్న ఏనుగులు

సాధార‌ణంగా ట్విట‌ర్‌లో సెల‌బ్రీటీలు, అధికారుల హ‌డావుడి ఎక్కువ‌గా ఉంటుంది. లాక్‌డౌన్ నుంచి ట్విట‌ర్ వ‌న్య‌ప్రాణుల‌కు అంకితం అయిపోయింది కాబోలు, రోజుకో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వీడియోతో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల ఓ వీడియోలో ఏనుగుల‌న్నీ ఎర్ర‌టి బుర‌ద‌మ‌ట్టిలో హోలీ ఆడ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఏనుగులు ఇలా చేయ‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది అంటున్నారు ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి సుధా రామెన్‌. 

ఏనుగులు న‌దిలో స్నానం చేసిన త‌ర్వాత బుర‌ద‌లో సేద‌తీరుతాయి. బుర‌ద, ఏనుగుల‌ను వేడి నుంచి ర‌క్షించ‌మే కాకుండా, క్రిమికాటు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. చ‌ర్మంపై ర‌క్ష‌ణ పొర‌ను ఏర్ప‌రుస్తుంద‌ట‌. ఇది వ‌డ‌దెబ్బ‌ను కూడా నివారిస్తుంది. అంతేకాదు ఆఫ్రికాలోని ఒక పున‌రావాసంలో ఏనుల‌న్నీ ఒక‌చోట చేరి బుర‌ద‌లో ఆడుకుంటాయ‌ట‌. ఈ వీడియోను సుధా రామెన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. logo