బుధవారం 20 జనవరి 2021
International - Dec 02, 2020 , 16:58:55

డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ మలేరియా 2020 నివేదిక...

డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ మలేరియా 2020 నివేదిక...

ఢిల్లీ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌ఓ)గణాంకాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా మలేరియాకు సంబంధించి కేసులపై   విడుదల చేసిన వరల్డ్ మలేరియా రిపోర్ట్ (డబ్ల్యూఎంఆర్) 2020, మలేరియా భారాన్ని తగ్గించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని సూచిస్తుంది. 2018 తో పోల్చితే 2019 లో కేసుల్లో 17.6 శాతం క్షీణతను సాధించిన ఏకైకదేశం భారత్. వార్షిక పరాన్నజీవి సంభవం (ఎపిఐ) 2017 తో పోలిస్తే 2018 లో 27.6శాతం , 2018 తో పోలిస్తే 2019 లో 18.4శాతం తగ్గింది. 2012 సంవత్సరం నుంచి ఏపిఐ ఒకటి కంటే తక్కువ.

ప్రాంతాల వారీగా చుస్తే అత్యధికంగా 20 మిలియన్ల నుంచి 6 మిలియన్లకు తగ్గిన కేసులకు భారతదేశం దోహదపడింది. 2000 -2019 మధ్య మలేరియా కేసులు 71.8శాతం , మరణాలు 73.9 శాతం తగ్గాయి. భారతదేశం 2000 సంవత్సరం (20,31,790 కేసులు, 932 మరణాలు), 2019 (3,38,494 కేసులు, 77 మరణాలు) మధ్య మలేరియా అనారోగ్యంలో 83.34శాతం మలేరియా మరణాలలో 92శాతం తగ్గి, మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో 6 వ లక్ష్యాన్ని సాధించింది.

(2000- 2019 మధ్య కేసులలో 50-75శాతం తగ్గుదల). మలేరియా కేసుల సంభవం తగ్గడం ఏటా కనిపిస్తుంది. 2018 (4,29,928 కేసులు, 96 మరణాలు) తో పోల్చితే కేసులు, మరణాలు 2019 సంవత్సరంలో వరుసగా  21.27% , 20శాతం (3,38,494 కేసులు, 77 మరణాలు) గణనీయంగా తగ్గాయి. 2020 లో అక్టోబర్ వరకు నమోదైన మొత్తం మలేరియా కేసుల సంఖ్య (1,57,284)- 2019 (2,86,091) తో పోలిస్తే 45.02 శాతం తగ్గింది.

2015 లో దేశంలో మలేరియా నిర్మూలన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2016 లో నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ (ఎన్‌ఎఫ్‌ఎంఇ) ను ప్రారంభించిన తరువాత చర్యలను తీవ్రతరం చేసింది. మలేరియా నిర్మూలనకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (2017-22) ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 2017 లో ప్రారంభించింది, ఇది రాబోయే ఐదేండ్లకు వ్యూహాలను రూపొందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo