ఆదివారం 31 మే 2020
International - Apr 14, 2020 , 16:53:02

భారత్‌లో లాక్‌డౌన్‌ను స్వాగతించిన డబ్ల్యూహెచ్‌వో

భారత్‌లో లాక్‌డౌన్‌ను స్వాగతించిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: భారత్‌లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్వాగతించింది. క‌రోనా క‌ట్ట‌డికి భార‌త్ స‌రైన  స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపింది. వైర‌స్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ ప్రశంసించారు.  భార‌త్ తీసుకుంటున్న‌ చర్యల ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు. కానీ ఆరువారాల లాక్‌డౌన్‌తోపాటు సామాజిక దూరం, వైద్యసేవల విస్తరణ, రోగులకు ఐసోలేషన్‌, రోగులను గుర్తించటంలో చూపుతున్న వేగం వల్ల వైరస్‌ వ్యాప్తి అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.logo