శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 08:50:58

మ‌హ‌మ్మారి ముగిసిన‌ట్లు ఏ దేశం భావించ‌వ‌ద్దు: డ‌బ్ల్యూహెచ్‌వో

మ‌హ‌మ్మారి ముగిసిన‌ట్లు ఏ దేశం భావించ‌వ‌ద్దు: డ‌బ్ల్యూహెచ్‌వో

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు స్తంభించిన ప‌లు దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు మ‌ళ్లీ గాడిలో ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌ర్ ప్రారంభాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, కానీ క‌రోనా మ‌హ‌మ్మారి వెళ్లిపోయిన‌ట్లు భావించ‌కూడ‌దు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. క‌రోనా వైర‌స్ ఆన‌వాళ్లు బ‌య‌ట‌ప‌డి 8 నెల‌ల అవుతున్న‌ద‌ని, ప్ర‌జ‌లు చాలా నీర‌సించి ఉంటార‌ని తాము అర్థం చేసుకోగ‌ల‌మ‌ని, కానీ ఏ ఒక్క దేశంలో కూడా మ‌హ‌మ్మారి అంతం అయిన‌ట్లు భావించ‌కూడ‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు. వైర‌స్ అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న‌ద‌ని, ప్రాణాల‌ను కాపాడ‌డంలో, వైర‌స్‌ను నియంత్రించ‌డంలో మ‌నం అంద‌రం సీరియ‌స్‌గా ఉండాల‌న్నారు.

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సుర‌క్షిత‌మైన చ‌ర్య‌లు అమ‌లు చేయాల‌ని అన్ని దేశాల‌ను డ‌బ్ల్యూహెచ్‌వో కోరింది. బ‌హిరంగ కూడిక‌ల‌ను నియంత్రించాల‌న్న‌ది. ఎక్కువ‌గా వైర‌స్ బారిన‌ప‌డే అవ‌కాశం ఉన్న వారిని ర‌క్షించే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌ది. వైర‌స్‌ను ప్ర‌పంచ‌దేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు త‌మ వ్యాపారాన్ని మొద‌లుపెట్ట‌వ‌చ్చు అని టెడ్రోస్ పేర్కొన్నారు. ఎటువంటి నియంత్ర‌ణ లేకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఓపెన్ చేయ‌డం ప్ర‌మాదానికి దారి తీస్తుంద‌న్నారు.  వైర‌స్ కాలం గ‌డిచిపోయింద‌న్న భావ‌నను ఈ దేశం కూడా చేయ‌వ‌ద్దు అన్నారు. logo