సోమవారం 01 జూన్ 2020
International - Apr 08, 2020 , 20:32:45

రిలాక్స్ కావొద్దు.. యూరోప్ దేశాల‌కు డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌

రిలాక్స్ కావొద్దు.. యూరోప్ దేశాల‌కు డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్‌


హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో యూరోప్ దేశాలు ఉదాసీనంగా ఉంటున్న విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సీరియ‌స్‌గా తీసుకున్న‌ది.  ఇట‌లీ, స్పెయిన్ దేశాల్లో ప‌రిస్థితి ఇంకా ఆందోళ‌న‌కంగా ఉన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో రీజిన‌ల్ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ హ‌న్స్ హెన్రీ క్లూజ్ తెలిపారు.  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో యూరోప్ దేశాలు చాలా త‌క్కువ ప్ర‌గ‌తిని న‌మోదు చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  చిన్న పొర‌పాటును కూడా వైర‌స్ ద‌రిచేర‌నీయ‌ద‌న్నారు.  ప్ర‌ణాళిక‌లు ఏమాత్రం మార్చినా ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌న్నారు.  ఎట్టిప‌రిస్థితుల్లోనూ లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌కూడ‌ద‌న్నారు. భౌతిక దూరాన్ని పాటించే నియ‌మాన్ని కూడా జాగ్ర‌త్త‌గా అమ‌లు చేయాల‌న్నారు. స్పెయిన్‌, ఇట‌లీ దేశాల్లో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని, ఆ దేశాలు ఎటువంటి రిలాక్స్ చ‌ర్య‌లు చేప‌ట్ట‌కూడ‌ద‌న్నారు. వైర‌స్ ప్ర‌భావానికి గురైన ప‌ది దేశాల్లో ఏడు దేశాలు యూరోప్‌లోనే ఉన్నాయి. యూరోప్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 52వేల 824 మంది మ‌ర‌ణించారు. ఇది రిలాక్స్ కావాల్సిన స‌మ‌యం కాదు, మ‌న సంఘ‌టిత చ‌ర్య‌లను రెండింత‌లు, మూడింత‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని క్లూజ్ తెలిపారు.logo