చైనా తీరుతో నిరాశకు గురయ్యా : WHO చీఫ్ టెడ్రోస్

జెనీవా : కరోనా వైరస్ మూలాలను గుర్తించేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనా ఇంకా అనుమతించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధానోమ్ పేర్కొన్నారు. చైనా తీరుతో ‘చాలా నిరాశకు గురయ్యాను’ అన్నారు. పది మంది బృందంతో బృందం కరోనా వైరస్ ప్రారంభ కేసులు నమోదైన ప్రాంతంలో పరిశోధించేందుకు ఈ నెలలో పర్యటించాల్సి ఉంది. గతేడాది కిందట చైనాలోని వూహాన్లో కరోనా వెలుగు చూసిన విషయం తెలిసిందే. ‘చైనా వెళ్లేందుకు అక్కడి అధికారుల బృందం అవసరమైన అనుమతులను ఇంకా ఖరారు చేయలేదని నేడు తెలిసింది’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ జెనీవాలో మంగళవారం జరిగిన ఆన్లైన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ విషయంపై చైనా అధికారులతో సంప్రదింపులు జరిగాయని, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు మిషన్ ప్రాధాన్యమని స్పష్టం చేసినట్లు తెలిపారు.
మిషన్‌కు పీటర్ బెన్ ఎంబారెక్ నేతృత్వం వహించనున్నారు. ఆయన జంతువ్యాధుల నిపుణుడు. గత జూలైలో ఒక మిషన్‌పై ఆయన చైనాకు వెళ్లి వచ్చిన వ్యక్తి. అంతర్జాతీయ బృందంలోని ఇద్దరు సభ్యులు ఇప్పటికే చైనా పర్యటన కోసం బయలుదేరారు. ప్రస్తుతం ఒకరు వెనక్కి తిరిగి రాగా.. మరొకరు ప్రయాణంలో ఉన్నారని ఎమర్జెన్సీ చీఫ్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. అది కేవలం లాజిస్టిక్, బ్యూరోక్రటిక్ సమస్య మాత్రమేనని తాము నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. వాటిని త్వరగా పరిష్కరి౦చగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. 2019 చివరిలో వెలుగులోకి వచ్చిన ప్రారంభ కేసులపై చైనాలోనే వచ్చాయన్న వార్తలను చైనా తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా పలు దేశాలు బీజింగ్ చర్యలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్