జెనీవా, జూన్ 21: దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ టీకాల టెక్నాలజీ బదిలీకి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికా రచిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. దీని కోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. ఈ కేంద్రంలో స్పైక్ ప్రొటీన్ జెనెటిక్ కోడ్‌తో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర తయారీదారులకు శిక్షణ ఇస్తామని తెలిపారు.