గురువారం 04 జూన్ 2020
International - May 12, 2020 , 09:57:06

అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

అత్యంత జాగ్ర‌త్త అవ‌స‌రం.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుతున్న వేళ‌.. కొన్ని దేశాలు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే నిబంధ‌న‌ల‌ను సుల‌భ‌త‌రం చేస్తున్న దేశాలు అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. వైర‌స్ వేగాన్ని త‌గ్గించ‌డంలో కొన్ని దేశాలు స‌ఫ‌లం అయ్యాయ‌ని, దీని వ‌ల్ల ఎంతో మంది ప్రాణాల‌ను కాపాడారని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. జ‌నీవాలో వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డం అంటే అది ఆశ‌కు సంకేత‌మ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ అన్ని దేశాలు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల రెండు ల‌క్ష‌ల 80 వేల మంది మ‌ర‌ణించారు.  సుమారు 40 ల‌క్ష‌ల మందికి వైర‌స్ సంక్ర‌మించింది.  

 ప్ర‌జా ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌టిష్టం చేయాల‌ని ర్యాన్ ప్ర‌భుత్వాల‌ను కోరారు.  కొత్త కేసుల‌ను గుర్తించి, వారిని ఐసోలేట్ చేసి, చికిత్స అందించాల‌ని ఆయ‌న అన్నారు. దీని వల్ల రెండో ద‌ఫా కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో కొన్ని దేశాలు ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేశాయ‌ని, కానీ కొన్ని దేశాలు ప‌ట్టించుకోలేద‌న్నారు. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌కుంటే. అది క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్‌కు దారి తీస్తుంద‌న్నారు. కోవిడ్‌19 ప‌ట్ల కొంద‌రికే యాంటీ బాడీలు ఉన్న‌ట్లు సీరోలాజిక‌ల్ అధ్య‌య‌నాల ఆధారంగా తెలుస్తోంద‌ని, అంటే చాలా వ‌ర‌కు జ‌నాభాకు వైర‌స్ సంక్ర‌మించే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంద‌ని టెడ్రోస్ అన్నారు.


logo