బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 08, 2020 , 22:06:25

వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళికలు రూపొందించాలి:డబ్ల్యూహెచ్‌వో

వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రణాళికలు రూపొందించాలి:డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ: ఆగ్నేయ ఆసియా దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేశాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అందరూ సమష్టిగా కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది. కొవిడ్‌-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే వాటిని సమర్థవంతంగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని దేశాలను కోరింది.  ఇటీవల, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వస్తుందని తెలిపారు. 

‘ప్రపంచంలోని ఇతర దేశాల్లోలాగే ఆగ్నేయ ఆసియా దేశాలు ప్రమాదంలో ఉన్నాయి. కొవిడ్‌-19 వ్యాప్తిని ఆపడానికి బలమైన నాయకత్వం, పకడ్బందీ ప్రజారోగ్య చర్యలు, స్పష్టమైన కమ్యూనికేషన్‌ ఉండాలి.’ అని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయ ఆసియా రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ రేసు ఊపందుకుందని వెల్లడించారు. మొదట వ్యాక్సిన్‌ లభ్యత పరిమితమయ్యే అవకాశమున్నందున జాతీయ టీకా వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేయాల్సి ఉంటుందన్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo