శనివారం 30 మే 2020
International - Apr 13, 2020 , 15:32:35

వ్యాక్సిన్ వచ్చేంత‌వ‌ర‌కు క‌రోనాతో ముప్పు: WHO

వ్యాక్సిన్ వచ్చేంత‌వ‌ర‌కు క‌రోనాతో ముప్పు: WHO

ప్రపంచ‌దేశాల‌పై ర‌క్క‌సిలా విరుచుకుప‌డ్డ క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సిన్‌నే స‌రైన మార్గ‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇప్ప‌టికిప్పుడు క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు లేవ‌న స్ప‌ష్టం చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేంత‌వ‌ర‌కు క‌రోనా ముప్పు  ఉంటుంద‌ని పేర్కొంది. అయితే కొంత కాలం పాటు త‌గ్గిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ...తిరిగి మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపింది. ఇందుకు ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించింది. వైర‌స్ ఎదుర్కొనేందుకు స‌రైన ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవాలని పేర్కొంది. ఇప్ప‌టికే ప్రపంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య దాదాపు 19ల‌క్ష‌ల‌కు చేర‌గా... మృతుల సంఖ్య ల‌క్ష దాటిపోయింది.


logo