బుధవారం 27 మే 2020
International - Apr 12, 2020 , 15:14:35

22 వేల ఆరోగ్య కార్యకర్తలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో

22 వేల ఆరోగ్య కార్యకర్తలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు సుమారు 22 వేల మంది కరోనా బారిన పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో 22,073 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వైరస్‌ పాజిటివ్‌లుగా తేలిందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది. పనిచేస్తున్న ప్రదేశాలు, జన సమూహాలు, వారి కుటుంబ సభ్యుల వల్ల వీరిలో ఎక్కువ మందికి ఈ వైరస్‌ వ్యాప్తిచెందినట్లు ప్రాథమికంగా తేలిందని పేర్కొంది. దీంతో ఆరోగ్య కర్యాకర్తలకు తగిన రక్షణ కల్పించాలని, వారికి మాస్కులు, గ్లౌజ్‌లు, గౌన్లు వంటివి సమకూర్చాలని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్‌వో ఆదేశించింది. 


logo