గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 19, 2020 , 08:49:23

చైనీస్ వైర‌స్ అనొద్దు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

చైనీస్ వైర‌స్ అనొద్దు.. డ‌బ్ల్యూహెచ్‌వో వార్నింగ్

హైద‌రాబాద్‌:  వైర‌స్‌ల‌కు స‌రిహ‌ద్దులు తెలియ‌దు. మీది ఏ జాతి అన్న సంగ‌తి దాకికి అవ‌స‌రం లేదు. నీ వ‌ర్ణంతోనే దానికి సంబందం లేదు. నీ బ్యాంకు అకౌంట్‌లో ఎంత డ‌బ్బు ఉన్నా ఆ వైర‌స్ ప‌ట్టించుకోదు. కానీ క‌రోనా గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ప‌దాల‌ను వాడాలి.  అనుచితంగా నోరు పారేసుకోవ‌డం స‌రికాదు. వైర‌స్ పేరుతో ఒక‌ర్ని వెక్కిరించ‌డం కూడా అభ్యంత‌ర‌క‌ర‌మే.  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైక్ ర్యాన్ ఈ విష‌యాల‌ను తెలిపారు.  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న ప్ర‌తి ట్వీట్‌లో అది చైనీస్ వైర‌స్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.  దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సీరియ‌స్ తీసుకున్న‌ది.  అలా సంబోధించ‌డం స‌రికాద‌న్న‌ది. 

2009లో హెచ్‌1ఎన్‌1 వైర‌స్ నార్త్ అమెరికాలో ప్రారంభ‌మైంద‌ని, కానీ అప్పుడు ఎవ‌రూ అమెరిక‌న్ ఫ్లూ అంటూ ఆ ప్రాంతం పేరుతో వైర‌స్‌ను పిలువ‌లేద‌ని ర్యాన్ అన్నారు.  ఇత‌ర వైర‌స్‌ల విష‌యంలో ఇదే త‌ర‌హా ప‌ద్ధ‌తి అవ‌లంబించాల‌న్నారు.  ఓ ప్రాంతంతో వైర‌స్‌ను పోల్చ‌డం ఆపేయాల‌న్నారు.  వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాలు అన్నీ క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల‌ని ర్యాన్ పిలుపునిచ్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 2 ల‌క్ష‌లు దాటిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియాసెస్ తెలిపారు.  వైర‌స్‌పై పోరాటం చేసే క్ర‌మంలో సంఘీభావ స్పూర్తి ఉండాల‌న్నారు.  


logo