శనివారం 06 జూన్ 2020
International - Apr 24, 2020 , 13:32:30

నోవెల్ క‌రోనా వైర‌స్‌ను కృత్రిమంగా నిర్మించ‌లేదు: డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌

నోవెల్ క‌రోనా వైర‌స్‌ను కృత్రిమంగా నిర్మించ‌లేదు: డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్ట్‌

హైద‌రాబాద్‌: త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఆధారాల‌ను బ‌ట్టి.. నోవెల్ క‌రోనా వైర‌స్‌(SARS-CoV-2) స‌హ‌జ‌సిద్ధంగా జంతువుల నుంచే పుట్టినట్లు తేలింద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ వైర‌స్‌ను ఎవ‌రూ మార్చ‌లేద‌ని, దాన్నెవ‌రూ కృత్రిమంగా నిర్మించ‌లేద‌ని పేర్కొన్న‌ది. గురువారం రిలీజైన డెయిలీ రిపోర్ట్‌లో ఆ సంస్థ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  కోవిడ్‌19 వైర‌స్ వైర‌స్.. జంతువుల నుంచే సంక్ర‌మించిన‌ట్లు ఆధారాలు ఉన్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది.  SARS-CoV-2 వైర‌స్‌కు జూనోటిక్ ఆధారాలు ఉన్న‌ట్లు తెలిపింది. జూనోటిక్ అంటే ‌జంతువుల‌ నుంచి మ‌నుషుల‌కు సోకే వైర‌స్ అన్న‌మాట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ప‌రిశోధ‌క‌లు SARS-CoV-2 జ‌న్యు ఫీచ‌ర్ల‌ను స్ట‌డీ చేస్తున్నార‌ని, కానీ ఆ వైర‌స్‌ను ల్యాబ‌రేట‌రీలో కృత్రిమంగా నిర్మించిన‌ట్లు తెలిపే ఆధారాలు లేన్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. ఒక‌వేళ వైర‌స్‌ను కృత్రిమంగా త‌యారు చేస్తే, దాని జీనోమ్ సీక్వెన్స్ లో భిన్న పార్శ్వాలు క‌నిపించేవ‌ని, కానీ అలా జ‌ర‌గ‌డం లేద‌ని ఆ రిపోర్ట్ పేర్కొన్న‌ది. SARS-CoV-2 వైర‌స్‌ను జ‌న‌వ‌రి ఆరంభంలో గుర్తించామ‌న్నారు. దాని జ‌న్యుక్ర‌‌మాన్ని జ‌న‌వ‌రి 11వ తేదీన ప‌బ్లిక్‌గా షేర్ చేశామ‌న్నారు. చైనాతో పాటు ఇత‌ర దేశాల నుంచి సేక‌రించిన వైర‌స్ డేటాను ప‌రిశీలిస్తే, దానికి గ‌బ్బిలాల‌తో సంబంధం ఉన్న‌ట్లు తేలింద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది. 


logo