సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 10:20:22

ప్ర‌గ‌తిశీల న్యాయ‌వాది @ క‌మ‌లా హారిస్‌

ప్ర‌గ‌తిశీల న్యాయ‌వాది @ క‌మ‌లా హారిస్‌

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తిరాలు క‌మ‌లా హారిస్ వ‌య‌సు 55 ఏళ్లు. గ‌త ఏడాది అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం డెమోక్ర‌టిక్ పార్టీ నామినేష‌న్ కోసం పోటీప‌డ్డారు. ప్రైమ‌రీ ఎన్నిక‌ల చ‌ర్చ‌ల్లో క‌మ‌లా .. జోసెఫ్ బైడెన్‌తో అనేక సంద‌ర్భాల్లో విభేదించారు.  జాతివివ‌క్ష ప‌ట్ల బైడెన్ అనుకూలంగా ఉన్న‌ట్లు క‌మ‌లా ఆరోపించారు.  కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్‌లో క‌మ‌లా హారిస్ పుట్టింది. ఆమె త‌ల్లి భార‌తీయురాలు. తండ్రి జమైకా న‌ల్ల‌జాతీయుడు. ఇమ్మిగ్రెంట్ పేరెంట్స్‌కు పుట్టిన ఆమె మాత్రం అమెరిక‌న్ అంటూ చెప్పుకుంటుంది. హోవ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఆమె చ‌దివింది. బ్లాక్ కాలేజీగా ఆ వ‌ర్సిటీకి గుర్తింపు ఉన్న‌ది.  

త‌న ఐడెంటీ ప‌ట్ల ఎటువంటి ఇబ్బంది లేద‌ని క‌మ‌లా హారిస్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పింది. క‌ల‌ర్, బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా రాజకీయాల చేయ‌కూడ‌దంటూ ఆమె గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.  యూనివ‌ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆమె న్యాయ‌ప‌ట్టా అందుకున్న‌ది. అల‌మేడా కౌంటీ జిల్లా అటార్నీ ఆఫీసులో త‌న కెరీర్‌ను ప్రారంభించింది. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో జిల్లా అటార్నీగా ఉన్న‌త ప‌ద‌విని అధిరోహించింది. కాలిఫోర్నియా అటార్నీ జ‌న‌ర‌ల్‌గా ఎన్నికైన తొలి మ‌హిళ‌గా, తొలి ఆఫ్రికా అమెరికా సంత‌తి మ‌హిళ‌గా కూడా క‌మ‌లా హారిస్‌కు గుర్తింపు వ‌చ్చింది. కాలిఫోర్నియాలో టాప్ ప్రాసిక్యూట‌ర్‌గా ఆమె ఉన్న‌త స్థానాన్ని అందుకున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రానికి రెండుసార్లు ఆమె అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. డెమోక్ర‌టిక్ పార్టీలో రేజింగ్ స్టార్‌గా కీర్తిని గాంచారు. ఈ నేప‌థ్యంలో ఆమె 2017లో కాలిఫోర్నియా జూనియ‌ర్ సేనేట‌ర్‌గా పోటీ చేశారు. అయితే ఆ చాంబ‌ర్‌లో ఎన్నికైన రెండ‌వ న‌ల్ల‌జాతి మ‌హిళ‌గా క‌మ‌లా హారిస్ గుర్తింపు తెచ్చుకున్నారు. 

గ‌త ఏడాది ఆరంభంలో అధ్య‌క్ష అభ్య‌ర్థి పోటీ కోసం ఆమె డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం ప్రారంభించారు.  ఓక్లాండ్‌లో సుమారు 20 వేల మందితో ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు.  కానీ హెల్త్‌కేర్ లాంటి కీల‌క అంశాల్లో ఆమె సంతృప్తిక‌ర స‌మాధానాలు ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో ఆమె అధ్య‌క్ష అభ్య‌ర్థిత్వ పోటీకి సంపూర్ణ అర్హ‌త సాధించ‌లేక‌పోయారు.  ప్ర‌గ‌తిశీల‌ న్యాయ‌వాదిగా ఆమెను గుర్తిస్తారు. కానీ ప్రైమ‌రీ ఎన్నిక‌ల వేళ‌.. డెమోక్ర‌టిక్ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా గెల‌వ‌డానికి ఆమెకు అనుకూలం వాతావర‌ణం క‌ల‌గ‌లేదు. ఉపాధ్య‌క్ష ప‌ద‌వి అభ్య‌ర్తిగా క‌మ‌లా హారిస్‌ను డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసెఫ్ బైడెన్ ఎంపిక చేశారు.  బైడెన్ కుమారుడు బియూతో గ‌తంలో హారిస్ ప‌నిచేశారు. ఆ ప‌రిచ‌యం ఇప్పుడు హారిస్‌కు ప‌నికి వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.  ఒక‌వేళ ఈ ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్ గెలిస్తే.. అప్పుడు 2024లో అమెరికా అధ్య‌క్ష పోటీకి భార‌త సంత‌తీయురాలు పోటీలో నిలిచే అవ‌కాశాలు ఉంటాయి. 
logo