గురువారం 04 జూన్ 2020
International - Apr 07, 2020 , 20:33:38

యాక్టింగ్ ప్ర‌ధాని.. ఎవ‌రీ డామినిక్ రాబ్ ?

యాక్టింగ్ ప్ర‌ధాని.. ఎవ‌రీ డామినిక్ రాబ్ ?

హైద‌రాబాద్: ఐసీయూలో ఉన్న బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌.. సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్‌గా ఉన్న‌ డామినిక్ రాబ్‌కు డిప్యూటీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  డామినిక్ రాబ్ వ‌య‌సు 46 ఏళ్లు. ఆయ‌న గ‌తంలో లాయ‌ర్‌గా చేశారు.  ఆక్స్‌ఫ‌ర్డ్‌, క్యాంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీల్లో ఆయ‌న డిగ్రీలు పొందారు.  2010 నుంచి క‌న్జ‌ర్వేటివ్ ఎంపీగా కొన‌సాగుతున్నారు.  ప్ర‌స్తుతం బ్రిట‌న్ ప్ర‌భుత్వంలో  విదేశాంగ‌ మంత్రిగా ఉన్నారు. ఫ‌స్ట్ సెక్ర‌ట‌రీ ఆఫ్ స్టేట్ కూడా ఆయ‌నే. ఈయ‌న‌కు క‌రాటేలో బ్లాక్‌బెల్ట్ కూడా ఉంది.  బ్రెగ్జిట్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బ్రిట‌న్ త‌ర‌పున వాదించిన కీల‌క లాయ‌ర్ కూడా డామినిక్ రాబ్‌.  మాజీ ప్ర‌ధాని థెరిస్సా మే ప్ర‌భుత్వంలో ఆయ‌న బ్రెగ్జిట్ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. గ‌తేడాది క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నాయ‌క‌త్వం కోసం జాన్స‌న్‌తోనూ డామినిక్ పోటీప‌డ్డారు.


logo