గురువారం 29 అక్టోబర్ 2020
International - Jul 06, 2020 , 00:47:31

హైడ్రాక్సీ, హెచ్‌ఐవీ డ్రగ్స్‌పై డబ్ల్యూహెచ్‌వో ట్రయల్స్‌ నిషేధం!

హైడ్రాక్సీ, హెచ్‌ఐవీ డ్రగ్స్‌పై డబ్ల్యూహెచ్‌వో ట్రయల్స్‌ నిషేధం!

జెనీవా: కరోనా మహమ్మారి ప్రభావంతో మృతుల రేటును తగ్గించడంలో విఫలమైనందుకు యాంటీ మలేరియా డ్రగ్‌, హెచ్‌ఐవీ ఔషధాల ట్రయల్స్‌ను నిలిపేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆదివారం ప్రకటించింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ (హెచ్‌సీక్యూ)తోపాటు హెచ్‌ఐవీని నివారించడానికి వాడే లొపినావిర్‌/రిటోనావిర్‌ ఔషధాల వినియోగించిన కరోనా రోగుల మరణాలు తగ్గిపోయాయని మధ్యంతర ట్రయల్స్‌ నివేదిక తెలిపింది. దీంతో ఆ ఔషధాలను మధ్యంతరంగా నిలిపివేయాలని ట్రయల్స్‌ అధికారులను డబ్ల్యూహెచ్‌వో అభ్యర్థించింది. అయితే, అమెరిక సంస్థ గిలాడ్‌కు చెందిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డిసివిర్‌పై ట్రయల్స్‌లో సమర్థవంతమైన ఫలితాలనిస్తుందని మరో ట్రయల్స్‌ బృందం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలో యూరోపియన్‌ యూనియన్‌ తమ సభ్య దేశాల్లో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు రెమ్‌డెసివిర్‌ వాడటానికి షరతులతో అనుమతినిచ్చింది.