ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 02, 2020 , 08:21:50

స్వీయ నిర్బంధంలో డ‌బ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్‌

స్వీయ నిర్బంధంలో డ‌బ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్‌

జెనీవా: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అథ‌నామ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తితో సంబంధాలుండ‌టంతో తాను సెల్ఫ్‌ క్వారం‌టైన్‌‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. 'క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వ్య‌క్తిని తాను కలిసినట్లు గుర్తించాను. అయితే త‌న‌కు కరోనా లక్షణాలు లేన‌ప్ప‌టికీ డ‌బ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు అనుగుణంగా స్వీయ నిర్బంధంలో ఉండి ఇంటి నుంచి పనిచేస్తా'న‌ని టెడ్రోస్ ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించడానికి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని తొలగించడానికి కరోనా ఆరోగ్య మార్గదర్శకాలు పాటించడం త‌ప్ప‌నిస‌ర‌ని చెప్పారు. డ‌బ్ల్యూహెచ్‌వోలో పనిచేస్తున్న తన సహచరులకు హాని కలిగించకుండా వారి జీవితాలను కాపాడేందుకు తాను స్వీయ నిర్బంధంలో ఉండి పనిచేస్తున్నానని వెల్ల‌డించారు‌.