బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 21:10:38

ఆరేళ్లు దాటిన పిల్లలు మాస్కులు ధరించాల్సిందే: డబ్ల్యూహెచ్‌వో

ఆరేళ్లు దాటిన పిల్లలు మాస్కులు ధరించాల్సిందే: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ఆరేళ్లు దాటిన పిల్లలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తేల్చిచెప్పింది. 6-11 ఏళ్ల మధ్య వయస్సుగల పిల్లలు జనసమ్మర్థప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. పన్నెండేళ్లలోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న భావన సరికాదని, ఇది ప్రమాదాన్ని కొనితెస్తుందని హెచ్చరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇది అత్యవసరమని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. 

కాగా, 12 ఏళ్లలోపు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, అది వారినుంచి ఇతరులకు సోకదనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచవో కీలక సిఫార్సులు చేసింది. ఆరేళ్లలోపు చిన్నారులు మాస్కులు పెట్టుకోనవసరం లేదని తెలిపింది. అయితే, 6-11 ఏళ్ల మధ్య వయస్సుగలవారు పరిస్థితిని బట్టి మాస్కులు ధరించాలని, పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించింది. 

p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo