గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 01:34:24

మంత్రదండమేదీ లేదు: డబ్ల్యూహెచ్‌వో

మంత్రదండమేదీ లేదు: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: ప్రపంచదేశాల్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఎలాంటి మంత్ర దండం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డెరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌ టీకా కోసం యావత్‌ ప్రపంచం నిర్విరామంగా కృషి చేస్తున్నది. పలు ప్రయోగాలు మూడో దశను కూడా చేరుకున్నాయి. వైరస్‌ను కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ రావాలని కోరుకుంటున్నాం. కానీ, ఇప్పటికిప్పుడు వైరస్‌ను ఎదుర్కొనే మంత్రదండం లేదు. ఎప్పటికీ ఉండకపోవచ్చు’ అని స్పష్టం చేశారు. vv


logo