మంగళవారం 26 జనవరి 2021
International - Dec 05, 2020 , 08:46:56

నేను వ్యాక్సిన్‌ తీసుకుంటా : ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌

నేను వ్యాక్సిన్‌ తీసుకుంటా : ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌

జెనీవా : కరోనా వ్యాక్సిన్‌పై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు తాను కూడా టీకా తీసుకుంటానని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోం తెలిపారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌ వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు టీకాను మొదట తీసుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టెడ్రోస్‌ వారి నిర్ణయాన్ని స్వాగతించారు. వారి ఆలోచన బాగుందని, ఇప్పటికీ తమ నిబద్ధతను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. వారు ప్రజలను ప్రభావితం చేయగలరని భావిస్తున్నానన్నారు. ‘అమెరికా మాజీ అధ్యక్షుల మాదిరిగానే మీరు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. నేను ఆ పని చేసేందుకు సంతోషిస్తాను’ అన్నారు. అయితే టీకాలు సమానంగా పని చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు.. మరొకరికి అవసరమైన వ్యాక్సిన్‌ను తీసుకోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. 


logo