గురువారం 28 మే 2020
International - May 18, 2020 , 03:07:02

నేటి నుంచి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశం

నేటి నుంచి డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశం

బీజింగ్‌: కరోనా వెలుగుచూసిన తర్వాత తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అసెంబ్లీ సమావేశాలు సోమవారం జెనీవాలో ప్రారంభంకానున్నాయి. చైనాపై ఆరోపిస్తున్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లాంటి దేశాలు ఓ అవకాశంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం ప్రతి స్పందనను స్వతంత్రంగా సమీక్షిస్తామని ఈయూ వెల్లడించింది.  

తనపై వచ్చిన ఆరోపణలకు డబ్ల్యూహెచ్‌వో వేదికగా సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమవుతున్నది.  తైవాన్‌కు ఆహ్వాన ప్రతిపాదనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌  మండిపడ్డారు. చైనా ఉత్పత్తుల బహిష్కరణకు పిలుపునిస్తామన్న ఆస్ట్రేలియాకు ఘాటుగానే జవాబిచ్చింది. ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నుంచి మాంసం దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది. logo