శుక్రవారం 05 జూన్ 2020
International - May 10, 2020 , 09:52:47

క్వారెంటైన్‌లో డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ..

క్వారెంటైన్‌లో డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ..

హైద‌రాబాద్‌: అమెరికా అంటువ్యాధుల సంస్థ నిపుణుడు, క‌రోనా టాస్క్‌ఫోర్స్ స‌భ్యుడు డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌసీ క్వారెంటైన్‌లోకి వెళ్లారు.  వైట్‌హౌజ్‌లో డాక్ట‌ర్ ఫౌసీతో పాటు మ‌రో ఇద్ద‌రు క్వారెంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వైట్‌హౌజ్‌లో ఒక‌రికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. వారు ముందుజాగ్ర‌త్త‌గా క్వారెంటైన్ అయ్యారు.  క‌రోనా వైర‌స్ గురించి దేశ ప్ర‌జ‌ల‌కు అనేక విష‌యాల‌ను చెప్పిన డాక్ట‌ర్ ఫౌసీ .. అమెరికాలో ఇప్పుడు పాపుల‌ర్ ఫిగ‌ర్‌గా మారారు. డాక్ట‌ర్ ఫౌసీతో పాటు డాక్ట‌ర్ రాబ‌ర్ట్ రెడ్‌ఫీల్డ్‌, డాక్ట‌ర్ స్టీఫెన్ హ‌న్‌లు ఉన్నారు. వాస్త‌వానికి క‌రోనా ప‌రీక్ష‌లో ఫౌసీకి నెగ‌టివ్ వ‌చ్చింది. కానీ క్వారెంటైన్‌లో ఉండ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.    


logo