వాషింగ్టన్ : అమెరికాలో సగం జనాభా పూర్తి స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో మళ్లీ వ్యాక్సినేషన్ వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం మంది టీకాలు వేసుకున్నారని, ఇదే రకంగా వ్యాక్సినేషన్ జరగాలని వైట్‌హౌజ్‌లోని కోవిడ్ డేటా డైరక్టర్ తెలిపారు. 50 శాతం జనాభా అంటే.. అమెరికాలో సుమారు 17 కోట్ల మంది పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్ వ్యాక్సిన్, లేదా సింగిల్ డోసు జాన్సన్ అండ్ జాన్సన్ తీసుకుని ఉంటారని ప్రభుత్వం చెప్పింది.